Tuesday 5 July 2016

7వ వేతన సంఘం సిఫారసులను కేంద్రం పునఃసమీక్షించాలి.

విషయాన్నైనా తిమ్మిని బమ్మిని చేసే వెసులుబాటు కేవలం సంఖ్యాశాస్త్రానికే పరిమితం. టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యల్లో ఆరితేరిన ప్రభుత్వం తాజాగా 7 వేతన సంఘం అమలులో అంకెలతో ఆడుకుంది. జస్టిస్ఎకె మాథుర్నేతృత్వంలోని వేతన సంఘం గతేడాది నవంబర్లో చేసిన సిఫారసులను ఉద్యోగులు, కార్మికులు నిర్ద్వందంగా వ్యతిరేకించినా, ఎలాంటి మార్పులూ చేయకుండానే మక్కీకి మక్కీ ఆమోదించడం అభ్యంతరకరం. 29.06.16న సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం 7 వేతన సంఘం సిఫారసులకు ఆమోదముద్ర వేసి, ఇది చారిత్రాత్మక నిర్ణయమంటోంది. కోటి కుటుంబాలకు సంతోషం పంచామని కోతలు కోస్తోంది. వేతన సంఘం సిఫారసుల అమలుపై ప్రభుత్వ ప్రచారం అనుకూల డబ్బా.

 7 వేతన సంఘం అమలు వలన ఉద్యోగుల వేతనాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయనడం ఎంతమాత్రం నిజం కాదు. 5 వేతన సంఘం వలన రూ.17 వేల కోట్లు, 6 వేతన సంఘం వలన రూ.40 వేల కోట్లు ఖజానాపై భారం పడగా సారి రూ.1.02 లక్షల కోట్ల బండ మోయాల్సి వస్తోందంటూ అక్కడికి ఉద్యోగులకు భారీగా ఒరగబెట్టా మంటోంది సర్కారు. 2008లో 6 వేతన సంఘం భారం అప్పటి జాతీయ స్థూలోత్పత్తి (జీడీపీ)లో 0.77 శాతం కాగా ఏడేళ్ల తర్వాత  అమలు చేస్తున్న 7 వేతన సంఘం భారం జీడీపీలో 0.65 శాతమే. గతం కంటే కూడా జీడీపీలో వేతనాల ఖర్చు తగ్గించుకొని ఉద్యోగులకు పెద్ద పీట వేశామనడం మోసం. ఏడేళ్లలో జీడీపీ ఎంతో పెరిగింది. నిత్యావసరాలు సహా సమస్త ధరలూ కొన్ని వందల రెట్లు పెరిగాయి. వాటితో పోల్చితే సగటున ఉద్యోగుల వేతనాలు, భత్యాలు కలిపి 23.55 శాతం పెంచడం ఊరట ఏమీ కాదు. వాస్తవానికి పెంపుదలతో ఉద్యోగుల స్థూల వేతనం పెరిగేది 14.27 శాతం మాత్రమే. కింది స్థాయి ఉద్యోగుల చేతికొచ్చే వేతనంలో పెరుగుదల కేవలం 7.4శాతం మాత్రమే. పైగా ఇప్పటికే ఇంక్రిమెంట్లు, భత్యాల రూపంలో పెరిగిన వేతనాలతో లెక్కిస్తే అదనంగా ఉద్యోగుల చేతికొచ్చేది నామమాత్రమే


గడచిన 70ఏండ్లల్లో అత్యల్ప పెంపు ఇదే. జూనియర్స్థాయి ఉద్యోగులు, పింఛనుదారులకు మూలవేతనంలో 14.27 శాతం పెంపును 7 వేతన సంఘం సిఫారసు చేయగా కేంద్రం దాన్నే ఓకే చేసింది. గతంలో 6 వేతన సంఘం 20శాతం సిఫారసు చేయగా అప్పటి సర్కారు అమలు చేసేటప్పుడు రెట్టింపు చేసింది. నిజాన్ని కావాలనే సర్కారు దాచి పెట్టింది. అందరికీ సరాసరిగా చూసుకున్నా 70 ఏండ్లలో తడవే అత్యల్ప పెంపు. కానీ కనీస వేతనాన్ని రూ.7 వేల నుంచి రూ.18 వేలు, గ్రాట్యూటీ, పరిహారం, గృహ రుణ పరిధి పెంచామని గొప్పలకు పోతోంది కేంద్రం. కేబినెట్సెక్రటరీ జీతం రూ.90 వేల నుంచి రూ.2.50 లక్షలకు పెంచామంటోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 47 లక్షల మందిలో కేబినెట్సెక్రటరీ ర్యాంక్వారిని వేళ్లపై లెక్కించవచ్చు. క్లాస్‌-1 ఆఫీసర్ల ప్రారంభ జీతం ఇక రూ.56,100 కాగా స్థాయి అధికారుల సంఖ్య పరిమితమే. లక్షలాదిగా ఉన్న ఉద్యోగుల జీతాలు పెరిగేది అంతంతమాత్రమే.


కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త వేతనాల వలన కనీస, అత్యధిక వేతనాలు తీసుకునే వారి మధ్య అసమానతలు పెంపొందుతాయి. ప్రయివేటు సంస్థల్లో కంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు గౌరవనీయ స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకుంటామంటోంది సర్కారు. అప్పుడే ప్రతిభావంతులు సర్కారీ ఉద్యోగాలపట్ల ఆకర్షితులవుతారనీ చెబుతోంది. ఉద్యోగుల జీతాల్లో భారీ అసంబద్ధత పెట్టుకొని తమ లక్ష్యాలు సాధిస్తామంటే ఎలా? వేతన సంఘం సిఫారసులను ఉద్యోగ, కార్మికులు గతంలోనే వ్యతిరేకించగా సర్కారు వారి అభిప్రాయాలను, డిమాండ్లను పట్టించుకోలేదు. కనీసం చర్చలు కూడా జరపకుండా ఏకపక్షంగా వ్యవహరించింది. దీంతో ఉద్యోగులు, కార్మికులు నిరసనలు తెలుపుతున్నారు. నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు

ఎఫ్ఆర్బీఎం, ఉద్యోగుల కోత, కొత్త రిక్రూట్మెంట్లేమి, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్పద్ధతుల ప్రవేశం నిరుద్యోగ యువతను ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్ఆదేశిత విధానాలను ప్రభుత్వం పుణికిపుచ్చుకొని అవి ఆడమన్నట్టు ఆడుతున్నాయి. కొన్ని రకాల భత్యాలను తొలగించాలని, కొన్నింటిలో మార్పు చేయాలన్న మాథుర్సిఫార్సులు కోవలోనివే. ఉద్యోగుల ఆగ్రహంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గినా పరిశీలన పేర కత్తి వేలాడుతూనే ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల జీత, భత్యాల పెంపుతో ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతుందని, పొదుపు, కొనుగోళ్లు పెరుగుతాయంటున్నారు విత్త మంత్రి జైట్లీ. కోట్లాదిమంది సంఘటిత, అసంఘటిత, ప్రయివేటురంగాల్లో అరకొర వేతనాలతో నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వరంగంలోనే కాంట్రాక్టు, ఔట్సోర్స్పై అత్యల్ప జీతాలపై వెట్టి చేస్తున్నారు. వీరందరికీ ధరల పెరుగుదలకనుగుణంగా కనీస, నిజ వేతనాలు పెంచి అమలు చేస్తే ఇంకా గిరాకీ పెరిగి మేరకు వ్యవస్థ బాగుపడుతుంది. ఇప్పటికైనా 7 వేతన సంఘం సిఫారసులను కేంద్రం పునఃసమీక్షించాలి. ఉద్యోగ, కార్మిక సంఘాల అభిప్రాయాలను, డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలి

2 comments:

  1. Very nice article improve more about retrograde 7th pay commission

    ReplyDelete
  2. Very nice article improve more about retrograde 7th pay commission

    ReplyDelete