Tuesday 26 July 2016

సీ-17 వినియోగంపై కాగ్‌ ఆగ్రహం - ప్రజాధనం దుర్వినియోగంపై ఐఏఎఫ్‌కు నోటీసులు

అమెరికా నుంచి కొనుగోలు చేసిన సీ-17 గ్లోబ్‌ మాస్టర్‌ విమానాల వినియోగంపై కాగ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత వైమానిక సంస్థ(ఐఏఎఫ్‌), అమెరికా వైమానిక సంస్థ బోయింగ్‌ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రూ. 18, 645 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి కొన్న పది సీ-17 విమానాలను సామర్థ్యం కంటే తక్కువ స్థాయిలోనే వినియోగిస్తున్నట్టు పార్లమెంటుకు మంగళవారం (26/07/16) సమర్పించిన నివేదికలో తెలిపింది. సిములేటర్‌ సేవలను నెలకొల్పడంలో బోయింగ్‌ నిర్లక్ష్య వైఖరిపై మండిపడింది. చాలా విమానాశ్రయాల్లో సీ-17కి తగిన రన్‌వేలు, లోడింగ్‌, అన్‌లోడింగ్‌ సౌకర్యాలు లేకపోవడమే వీటి వినియోగంపై ప్రభావం చూపిస్తోంది. ఈ విమానాలు అధిక బరువును మోసుకుపోవడమే కాకుండా, చాలా వేగంగా లోడింగ్‌ అండ్‌ అన్‌లోడింగ్‌ చేసే సౌకర్యముంది. దీన్ని వినియోగించుకోవడంలో ఐఏఎఫ్‌ విఫలమైంది. దీని వల్ల రవాణా ఖర్చు పెరుగుతోందని ఆ నివేదికలో కాగ్‌ వివరించింది.

No comments:

Post a Comment